రాజ్ కోట్ లో నిరాశపర్చిన టీమిండియా

15-1444847622-msdhoni-indore-win-sa-600మళ్లీ సేమ్ సీన్… ఐదు వన్డేల సిరీలో భాగంగా రాజ్ కోట్ వన్డేలో టీమిండియా ఓడింది. గెలిచే ఛాన్సున్నా బ్యాట్స్ మెన్ వైఫల్యం మరోసారి ధోనీసేనకు శాపంగా మారింది. టార్గెట్ చేజింగ్ లో ముందు మురిపించిన ధోనీ గ్యాంగ్ చివర్లో చతికిలబడింది. దీంతో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా…50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్లు డీకాక్, డేవిడ్ మిల్లర్ లు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. లాస్ట్ రెండు వన్డేల్లో విఫలమైన మిల్లర్ 33 రన్స్ తో పర్వాలేదనిపించాడు. మరో ఓపెనర్ డీ కాక్ సెంచరీతో చెలరేగాడు. 118 బాల్స్ లో 103 చేశాడు…సఫారీల విక్టరీలో మెయిన్ రోల్ ప్లే చేశాడు.

ఫస్ట్ డౌన్ లో వచ్చిన ఆమ్లా..కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు.. డుప్లెసిస్ 60 రన్స్ తో మరోసారి రెచ్చిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన…ఏబీ డివిలర్స్ 4..జేపీ డుమిని 14 పరుగులకు పెవిలియన్ చేశాడు. అయితే చివర్లో బెహార్డిన్ 33 రన్స్ చేయడంతో 7 వికెట్ల నష్టానికి 270 రన్స్ చేసింది. టీమిండియా బౌలర్లలో మోహిత్ శర్మకు రెండు వికెట్లు లభించగా, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ దక్కింది.

271 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ధోనీ గ్యాంగ్ స్లో అండ్ స్టడీని ఫాలో అయ్యింది. అయితే ముందు మురిపించిన ధోనీ గ్యాంగ్ చివర్లో చతికిలబడింది. ఓపెనర్ ధావన్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 13రన్స్ మాత్రమే చేశాడు..అయితే మరో ఓపెనర్ రోహిత్ 65 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. లాస్ట్ రెండు వన్డేల్లో విఫలమైన విరాట్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 77 రన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఫోర్త్ డౌన్ లో వచ్చిన 47 రన్స్ చేశాడు. చివర్లో వచ్చిన సురేష్ రైనా మరోసారి డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు. అయితే లాస్ట్ ఓవర్లలో తీవ్ర ఒత్తిడికి లోన్ కావటంతో ధోనీ గ్యాంగ్ చతికిలబడింది. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో  ఆరు వికెట్ల కోల్పొయి 252 పరుగులకే పరిమితమైంది.  దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కల్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచాడు. జేపీ డుమినీ, ఇమ్రాన్ తాహీర్ లకు తలో వికెట్ లభించింది.

ఈ మ్యాచ్ లో విక్టరీతో 2-1 తేడాతో లీడ్ లోకెళ్లింది సౌతాప్రికా. ఇప్పటికే టీ20 సిరీస్ ని లాసైంది ధోనీ గ్యాంగ్. వన్డే సిరీస్ నైనా గెలవాలంటే మిగతా రెండు మ్యాచ్ ల్లో గెలవాల్సి ఉంటుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy