రాణా జోర్ దార్ ఇన్నింగ్ తో ముంబై గెలుపు

rana-mumbaiఐపీఎల్‌ 10లో ముంబై ఇండియన్స్‌ జోర్ దార్ ఇన్నింగ్స్ ఆడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. నితీష్‌ రాణా (50) విధ్వంసక బ్యాటింగ్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. మనీష్‌ పాండే (81 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్ తో కోల్ కతాకు భారీ స్కోరు అందించినా ఫలితం లేకుండా పోయింది. కోల్‌కతా 7 వికెట్లకు 178 పరుగులు చేసినా.. రాణా అదరగొట్టడంతో లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది ముంబై. ఓపెనర్లు పార్థివ్‌ (30), బట్లర్‌ (28) 65 పరుగులు జోడించి బలమైన ఆరంభాన్నిచ్చినా.. ముంబై చకచకా నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. చివరి ఏడు ఓవర్లలో 74 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఐతే రానా చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. అయినా సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. చివరి 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సివుండగా ముంబై ఓటమి తప్పదనిపించింది. కానీ రాణా ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదడంతో గెలుపు సాధ్యమైంది. 19వ ఓవర్లో, విజయానికి 20 పరుగుల దూరంలో అతడు ఔటైనా … హార్దిక్‌ పాండ్య (29 నాటౌట్‌; 11 బంతుల్లో 3×4, 2×6) కోల్‌కతాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. రెండు, ఐదో బంతికి బౌండరీలు దంచి ముంబయిని విజయతీరాలకు చేర్చాడు. ఫీల్డింగ్‌ వైఫల్యమూ కోల్‌కతాను దెబ్బతీసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy