రాత్రికి రాత్రి పరిష్కారం కావు : కేసీఆర్

KCR రైతు సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసునని.. అన్నీ రాత్రికి రాత్రి పరిష్కారం కావన్నారు సీఎం కేసీఆర్. చిత్తశుద్ధిలో కష్టపడుతున్నాం అని.. విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్ హైలెట్స్ ఇలా ఉన్నాయి.

 

 

> సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం.. రైతు ఆత్మహత్యలు నివారించాలన్నదే మా లక్ష్యం

>  సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారం కావు.. గత పాలకులు ఎన్నో ప్రాజెక్టులు అసంపూర్తిగా వదిలేశారు

అగ్రికల్చర్ యూనివర్సిటీని నిర్వీర్యం చేశారు.. వ్యవసాయ పరిశోధనలు మూలకు పడ్డాయి

> కాకతీయ రాజులు 75వేల చెరువులు నిర్మించారు.. చెరువుల మరమ్మతుకు ఒక్క రూపాయి కేటాయించలేదు

> దశాబ్దాల సమస్య ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం కాదు.. దీర్ఘకాలిక విధానాలతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం.. క్షేత్రస్థాయిలో రైతు సమస్యలు తెలుసు

>  26 దేశాలకు తెలంగాణ నుంచి విత్తనాలు సప్లయ్ అవుతున్నాయి.. దేశంలో వ్యవసాయానికి 60శాతం విత్తనాలు అందిస్తున్నాం

> విద్యుత్ కొరత వల్ల కేరళ నుంచి పవర్ కొన్నాం.. చత్తీస్ గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లు కొన్నాం

>  మొదటిసారిగా కరెంట్ సమస్య లేకుండా సభ జరుగుతోంది.. ఇండస్ట్రీలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం.. వ్యవసాయానికి క్వాలిటీ పవర్ సప్లయ్ చేస్తున్నాం

>  వచ్చే మార్చి నుంచి ఉదయం 9 గంటల కరెంట్ ఇస్తాం.. 2018 నాటికి త్రీఫేస్ కరెంట్ సప్లయ్ చేస్తాం

24వేల కోట్లతో ఎన్టీపీసీ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది.. దామరచర్లలోనూ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం.. ఇకపై తెలంగాణలో కరెంట్ కోతలు ఉండవు

> మిషన్ కాకతీయను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ మెచ్చుకున్నారు

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy