రాత్రికి రాత్రే రైతు ఆత్మహత్యలను ఆపలేం: సుప్రీం

Supreme-courtదేశవ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. రాత్రికి రాత్రే ఈ సమస్యకు పరిష్కారం చూపలేమని తెలిపింది. రైతు ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం నివేదించిన విన్నపంలోని అంశాలతో ఏకీభవిస్తున్నట్లు జస్టిస్‌ జెఎస్‌ ఖేహార్‌, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఆరు నెలల క్రితం రైతు మరణాలపై ‘సిటిజెన్స్‌ రిసోర్స్‌ అండ్‌ యాక్షన్‌ ఇనీషియేటివ్‌(క్రాంతి)’ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌ను విచారించింది ధర్మాసనం. ఈ విచారణకు కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ హాజరయ్యారు. రైతుల కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని… ఫలితాలు వచ్చేందుకు కనీసం ఏడాదైనా గడువు కావాలని ఆయన కోర్టుకు నివేదించారు. ఫసల్‌ బీమా యోజనతో సహా పలు రైతు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 12 కోట్ల మంది రైతులు రూ. 5.34 కోట్ల విలువైన పంట బీమా కిందకి వచ్చారని ఎజి ప్రస్తావించారు. 30 శాతం పంట భూమి బీమా పథకం కిందకి వచ్చిందని… 2018 నాటికి ఆ శాతం మరింత పెరుగుతుందని చెప్పారు. అయితే ప్రభుత్వ వివరణపై స్పందించిన ధర్మాసనం ”మరి రైతు ఆత్మహత్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయెందుకు?” అని మొదట ప్రశ్నించింది. ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యల నివారణకు తమ సంస్థ సూచించిన సలహాలు స్వీకరించాలని క్రాంతి సంస్థ తరపు న్యాయవాది….ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy