రాత్రికి రాత్రే విశ్వనగరం కాదు: కేటీఆర్

ktrహైదరాబాద్ లో అందరికీ మంచినీళ్లు అందుతున్నాయంటే టీఆర్ఎస్ సర్కారే కారణమన్నారు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. నగర అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్… చేస్తున్న పనులకు మున్సిపల్ శాఖ సహకరిస్తుందన్నారు. 2017-18లో రూ.750 కోట్లు కేటాయించామని.. దాన్నుంచి హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు రూ. 125 కోట్లు, మూసీ ప్రక్షాళనకు ఎమ్మార్డీసీ రూ. 122 కోట్లు కేటాయించామన్నారు. అంతేకాకుండా పేదలకు లక్ష డబుల్ బెడ్ రూమ్ లు నిర్మిస్తున్నామని.. దీనికోసం 8వేల కోట్ల రూపాయలు… GHMCకి సంబంధం లేకుండా ప్రభుత్వమే ఇచ్చింది. 20వేల కోట్ల రూపాయలతో నాలుగు దశల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. పూణే నగరంలో మున్సిపల్ బాండ్స్ తో నిధులు తెచ్చుకున్నారని… జీహెచ్ఎంసీ కూడా అదే విధంగా నిధులు తెచ్చుకుంటుందన్నారు. రూ.1000 కోట్లు తెచ్చుకోనున్నామన్నారు. విశ్వనగరం రాత్రికి రాత్రే వచ్చేయదని… 400 ఏళ్ల హైదరాబాద్ నగరాన్ని వానపడితే నీళ్లు నిలిచిపోయే స్థితిలో తమకిచ్చారని.. దాన్ని బాగుచేస్తున్నామన్నారు కేటీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy