రామయ్యా.. ఏందయ్యా.? ఈయన కోసం అంబులెన్స్ మళ్లీ ఆపేశారు

sidhhuకర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి తీవ్ర విమర్శల పాలయ్యారు. ఆయన కాన్వాయ్‌ కోసమం అంబులెన్స్ ను నిలిపేశారు భద్రతా సిబ్బంది. మండ్యా జిల్లా నగమంగల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్ధరామయ్య  కాన్వాయ్‌ వస్తున్న సమయంలో అంబులెన్స్‌ కూడా వచ్చింది. అయితే సీఎం కాన్వాయ్‌ వెళ్లడం కోసం రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి అంబులెన్స్‌ను నిలిపివేశారు. అంబులెన్స్‌ను వెళ్లనిచ్చేందుకు మార్గాన్ని ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. భద్రతా కారణాల దృష్ట్యా వెళ్లనిచ్చేది లేదని చెప్పారు. అవసరమైతే అంబులెన్స్‌లో ఉన్న రోగిని దించేసి నడుచుకుంటూ ఆసుపత్రికి  తీసుకెళ్లమనటంతో చేసేదేమి లేక రోగిని నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్‌ కోసం అంబులెన్స్‌ను ఆపడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో ఆయన కాన్వాయ్‌ కోసం దాదాపు 30 నిమిషాల పాటు అంబులెన్స్‌ను ట్రాఫిక్‌లోనే ఉంచేశారు. అయితే ఇక్కడో విషయం గుర్తు చేయాలి.  అంబులెన్స్‌ కోసం రాష్ట్రపతి కాన్వాయ్‌నే ఆపేసిన అదే బెంగళూరులో సీఎం కోసం అంబులెన్స్‌ను ఆపేయడం గమనార్హం. జూన్‌లో ఓ అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం ట్రాఫిక్‌ పోలీస్‌ నిజలింగప్ప అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కాన్వాయ్‌ని నిలిపివేసి అందరి ప్రశంసలు పొందారు.

తాజా ఘటనపై జనం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జనం ప్రాణాలు పట్టించుకోకుండా … ఇలా సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్ ను అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy