రామోజీ ఇంట పెండ్లికి ప్రముఖుల సందడి

WEDDING-RESPTION-హైదరాబాద్ లోని  రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మనుమరాలు  సహరి – రేచస్‌ వీరేంద్రదేవ్‌ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రంగురంగుల విద్యుద్దీపాలతో, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పచ్చిక బయళ్లతో, ప్రత్యేక అలంకరణలతో, సుమగంధాలు వెదజల్లుతుంటే తారామండలం అంతా ఇక్కడే కొలువుదీరిందా అన్నట్లు ఫిల్మ్‌సిటీ కొత్త సోయగాల్ని సంతరించుకుంది. సంప్రదాయ సంగీతవాద్యాలపై కీర్తనలు పలికిస్తుండగా వివాహం వైభవంగా సాగింది. పెళ్లి వేడుకకు విచ్చేసిన అతిథులకు దక్షిణభారత సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో  తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు,  కేంద్ర మంత్రులు పి.అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, బండారు దత్తాత్రేయ, రాజీవ్‌ప్రతాప్‌ రూఢీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారి, ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు,  వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, జనసేన అధ్యక్షుడు, ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, భాజపా శాసనసభపక్ష నేత కిషన్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌నారాయణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య, ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌, బాలీవుడ్‌ కథానాయకుడు అభిషేక్‌ బచ్చన్‌, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ,మహారథులంతా పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy