రామ్ చరణ్ కి అన్న గా ఆర్యన్ రాజేష్

ram-charan-boyapati-aryanరామ్ చరణ్ కి అన్న గా నటించనున్నారు ఆర్యన్ రాజేష్. చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆర్యన్ రాజేష్. బోయపాటి శ్రీను డైరక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఘూటింగ్ కొన్నిరోజుల క్రితం స్టార్ట్ అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అన్న పాత్రలో ఆర్యన్ రాజేష్ కన్పించనున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు ‘జిల్‌ జిల్‌ జిగేల్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో సోదరుడి పాత్ర కూడా అంతే కీలకమని సినిమా యూనిట్ తెలిపింది. జర్నీ ఫేం అనన్య ఇందులో ఆర్యన్‌ రాజేశ్‌ భార్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.  బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy