రామ్ నాథ్ కు పోటీ తప్పదా..?

ramnath-kovind-444రామ్ నాథ్ కోవింద్ ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అభ్యర్థిని ప్రకటించేసి… తర్వాత విపక్షాలకు ఫోన్లు చేయడం బాగాలేదన్నారు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ ఒక్కపార్టీగా నిర్ణయం తీసుకోదన్నారు. 22నాడు అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమాజ్ వాదీ, జేడీయూ, ఆర్జేడీ నేతలు కూడా ఇదే అన్నారు.

ఇక తృణమూల్ కాంగ్రెస్ అయితే… రామ్ నాథ్ ఎవరో తెలియదన్నట్లుగా ట్వీట్లు పెట్టింది. రామ్ నాథ్ కంటే పెద్ద దళిత నాయకులు దేశంలో చాలా మంది ఉన్నారన్నారు తృణమూల్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దళిత నాయకుడిగా రామ్ నాథ్ కు సానుకూలమే అన్నారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. అయితే రామ్ నాథ్ కంటే పెద్ద దళిత నాయకుడిని ప్రతిపక్షం నిలబెడితే… ఆ అభ్యర్థికే మద్దతిస్తామన్నారు.

కమ్యూనిస్టు పార్టీలు రామ్ నాథ్ ను వ్యతిరేకించాయి. ఆయన RSS వ్యక్తనీ… అందుకని మద్దతివ్వబోమన్నారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదన్నారు. దళితుల పేరుతో ప్రతిపక్షాల నోరు మూయించలేరని చెప్పారు సీపీఐ నేతలు. రామ్ నాథ్ కు మద్దతిస్తే… దళితుల మీద దాడులను సమర్థించినట్టు అవుతుందన్నారు సీపీఐ నేత నారాయణ. రామ్ నాథ్ కోవింద్ ను అభ్యర్థిగా ప్రకటించగానే ఆయన్ను కలిశారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. శుభాకాంక్షలు చెప్ప డానికే కలిశానన్న నితీశ్… మద్దతివ్వడం మీద మాట్లాడలేదు.

బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా మద్దతు మీద ఏం చెప్పలేదు. దేశానికి మేలు చేసేదైతే మద్దతిస్తామనీ, అంతేగానీ దళిత నాయకుడిని పెట్టడం పార్టీ నిర్ణయం మీద ప్రభావం చూపించదన్నారు సేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే. ప్రతిపక్షంలో ఉన్న 17 పార్టీలు 22నాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం కానున్నాయి. అయితే ప్రతిపక్షంలో చాలా పార్టీలు వ్యతిరేకంగానే ఉన్నట్టు కనిపిస్తున్నది. దీంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తాలేవు.

Leave a Reply

bathukamma song

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy