రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాల్సిందే: టీజీ

TG-Venkatesh-addressing-Media-at-CLP-2
విభజన తర్వాత మిగతా ఆంధ్రరాష్ట్రానికి కర్నూలు ను రాజధాని చేయాలన్నారు మాజీ మంత్రి టీజీ వెంకటేష్. కర్నూలును రాజధానిగా చేయడంతో రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. కర్నూలు రాజధానిగా ప్రకటించకపోతే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టీజీ.

ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ సమయంలో కర్నూలు రాజధాని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రాష్ట్రాన్ని విడదీశారంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అజెండాలో రాష్ట్ర విభజన అంశాన్ని చేర్చి ఆమోదిస్తే తాము గౌరవంగా తప్పుకునేవారమన్నారు. కర్నూలును రాజధానిగా చేయకపోతే ఆందోళనలు పెంచుతామన్నారు టీజీ వెంకటేష్. రాయలసీమలో విలువైన వజ్రాలు, బంగారు గనులు ఉన్నాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు రాయలసీమకు న్యాయం చేయలేవన్నారు టీజీ. కర్నూలును రాజధానిగా చేసి న్యాయం చేయలని మరోసారి స్పష్టం చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy