‘రారండోయ్ వేడుక చూద్దాం’అంటున్న చైతూ

rarandoyahహ్యాండ్సమ్ యంగ్ హీరో నవయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. ఉగాది కానుక‌గా ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ను అభిమానుల కోసం విడుద‌ల చేసింది చిత్ర బృందం. సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌  చైతూ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఈ చిత్రంలో చైతూ స‌ర‌స‌న అందాల భామ ర‌కుల్ ప్రీత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రెండు పోస్ట‌ర్స్‌ను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. హీరో హీరోయిన్లు ఒక ట్రెడిష‌న్ గీతానికి స్టెప్పులేసే లుక్‌ను ఈ చిత్ర నిర్మాత చైతూ తండ్రి నాగార్జున ఫేస్‌బుక్ ద్వారా రిలీజ్ చేయ‌గా చైతూ చేజింగ్ సీన్ చేస్తున్నట్లున్న ఫోటోను డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ రిలీజ్ చేశారు. అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌పై వ‌స్తున్న ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. జూలైలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ తెలిపింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy