రావమ్మా తల్లీ : శ్రీశైలానికి పోటెత్తిన వరదనీరు

Srisailam Dam

ఇన్ని రోజులు నీళ్లు లేక వట్టిపోయిన కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు జలకళ వస్తోంది. కర్నూలుతోపాటు.. కర్నాటక ఆపైన ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. తుంగభద్ర నుంచి వస్తున్న వరదతోని కృష్ణానదిలో వరదనీరు ఉరకలేస్తోంది. ఏపీ-కర్నాటక  సరిహద్దులోని తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లోని వాగులు,  వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో నదిలో వరద ఉధృతి పెరిగింది. మంత్రాలయం, ఎమ్మిగనూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో లక్షా 20 వేల క్యూసెక్కుల వరదనీరు ఆర్డీఎస్ మీదుగా పారుతోంది

కర్నూలు జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలతో కుందూనది పొంగిపొర్లుతోంది. ఏపీ-కర్నాటక సరిహద్దులోని ఆర్డీఎస్ ఆనకట్టకు 82 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. ఈ నీరంతా దిగువన కర్నూలు జిల్లాలోని సుంకేశుల మీదుగా.. కృష్ణా నదిలో చేరుతోంది.

కర్నాటకలోని నారాయణ పూర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న నీటిని జూరాలకు వదులుతున్నారు. జూరాలలో 13గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కులు, పవర్ ప్రాజెక్టు ద్వారా 44 వేల క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. దీంతో సుంకేశుల, జూరాల రెండు వైపుల నుంచి 2లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది..

పాతాళానికి పడిపోయిన శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కొద్దిసేపటి క్రితం నీటిమట్టం 837 అడుగులు దాటింది. మూడ్రోజులు ఇదే వరద కొనసాగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ప్రస్తుతం 58 టీఎంసీల నీటి లభ్యత ఉన్న శ్రీశైలం డ్యామ్ లో వరద కంటిన్యూ అయితే 100 టీఎంసీలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy