రాష్ట్రంలో కొత్తగా 5 విమానాశ్రయాలు : సర్వేకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు

రాష్ట్రంలోని  పలు ప్రాంతాల్లో  విమానయాన  సదుపాయం  కల్పించేందుకు అవసరమైన  కార్యాచరణ  రెడీ చేయాలని  అధికారులను  ఆదేశించారు మంత్రి కేటీఆర్. గురువారం (జూలై-19) కొత్త విమానాశ్రయాల  ఏర్పాటుపై  అధికారులతో సమీక్ష  నిర్వహించారు మంత్రి. రాష్ట్రంలో  వరంగల్ జిల్లా  మామునూరు, ఆదిలాబాద్,  రామగుండం, నిజామాబాద్ జిల్లా  జక్రాన్ పల్లి,  కొత్తగూడెంలో  కొత్త విమానాశ్రయల  ఏర్పాటుకు అవకాశాలు  ఉన్నాయన్నారు. ఇందుకు  అవసరమైన  సర్వేలు చేపట్టాలని అధికారులకు  సూచించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy