రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేయాలి: సీఎం

cm-kcrరాష్ట్రంలో భూమి అమ్మకాలు, కొనుగోళ్లన్నీ పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు సీఎం కేసీఆర్. భూ రికార్డులన్నీ ప్రక్షాళన చేయాలని… ఏ భూమి ఎవరి పేరుతో ఉందో తేల్చాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సర్వే సెటిల్ మెంట్ చేయాలన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

పట్టాదారు పాస్ పుస్తకాలు, పహాణీ పేపర్లు మరింత సరళంగా ఉండాలని, గందరగోళానికి దారి తీసే అంశాలకు తెరవేయాలని సీఎం అధికారులకు సూచించారు. బ్యాంకులో లావాదేవీలు ఎంత పారదర్శకంగా జరుగుతాయో అంతే పారదర్శకంగా భూ రికార్డుల నిర్వహణ జరగాలన్నారు. భూమి రికార్డులను ప్రక్షాళన చేయడంతో పాటు భవిష్యత్తులో సులభంగా లావాదేవీలు జరుపుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్రామం యూనిట్ గా జరిగే సర్వే సెటిల్ మెంట్ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణను రూపొందించి… వీలైనంత త్వరగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు.

నిజాం కాలంలో 1936లో చేసిన బందోబస్తు తప్ప మళ్లీ భూమి రికార్డులన్నీ ప్రక్షాళన చేసే కార్యక్రమం జరగలేదన్నారు. దీనివల్ల అనేక ఇబ్బందులు, వివాదాలు తలెత్తున్నాయన్నారు. శాంతి భద్రతల సమస్యలకు కూడా భూ వివాదాలు కారణమవుతున్నాయని తెలిపారు. ఈ భూ వివాదాలకు స్వస్తి చెప్పడానికి రాష్ట్రంలోని భూభాగాన్నంతా సర్వే చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏ భూమి ఎంత విస్తీర్ణంలో ఎవరి పేరు మీదుందో సర్వే నిర్వహించాలని… దీనికోసం సర్వే ఆఫ్ ఇండియాతో పాటు దేశంలోని వివిధ సర్వే ఏజన్సీల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy