రాష్ట్రంలో రాష్ట్రపతి శీతాకాల విడిది

pronabహైదరాబాద్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్ కు వచ్చిన ప్రణబ్ కు  గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర అధికారులు స్వాగతం పలికారు.  సీఎం కేసీఆర్ ప్రణబ్ కు పాదాభివందనం చేశారు. ఆ తర్వాత కేబినెట్ మంత్రులను రాష్ట్రపతికి స్వయంగా పరిచయం చేశారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 31 వరకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉండనున్నారు ప్రణబ్ ముఖర్జీ. 14 రోజుల పాటు ప్రణబ్ ముఖర్జీ బిజీబిజీగా గడపనున్నారు. రాష్ట్రంతో పాటు..ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రణబ్. ఇవాళ ఉదయం సికింద్రాబాద్ లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కాన్వొకేషన్ కు అటెండ్ కానున్నారు. ఆ తర్వాత 22, 23వ  తేదీల్లో కర్ణాటకలో పర్యటించనున్నారు ప్రణబ్. 25 న ఏపీలో పర్యటించనున్నారు రాష్ట్రపతి. భీమవరంలో టీటీడీ కొత్తగా ఏర్పాటు చేసిన వేద పాఠశాలను ప్రారంభిస్తారు. 27న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సదస్సులో మాట్లాడనున్నారు. ఇక అదే రోజు ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి KCR నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి వెళ్తారు ప్రణబ్. 29 న రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందుకు హాజరుకానున్నారు రాష్ట్రపతి. 30 న బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ట్రీట్ ఇవ్వనున్నారు. 31 న పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్తారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy