రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం

Hyderabad: A cloudy sky in Hyderabad on May 25, 2015. (Photo: IANS)రుతువులను బట్టి కాలలు మారటం సహజం. కాని ప్రస్తుతం మాత్రం అలా లేదు. వాతావరణంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎప్పూడూ లేని విధంగా ఈసారి  వెదర్ లో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. వేసవి రాకముందే ఉష్ణోగ్రతలు పెరగటం, ఉదయం ఏడు దాక పొగమంచుతో ఉండటం, ఆ తర్వాత క్రమక్రమంగా వీపరితమైన ఎండ కొట్టడం జరుగుతోంది.  కామన్ గా అయితే డిసెంబర్ నెలలో భారీగా చలి ఉంటుంది. మార్నింగ్ టైంలో ఎదుటి మనిషి కనిపించకుండా మంచు కురుస్తుంది. ప్రస్తుతం చలికి బదులు ఎండ చంపేస్తోంది. రాత్రి వేళలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లాస్ట్ 30 ఇయర్స్  ప్రకారం…నైట్ టైంలో 10 నుంచి 15 డిగ్రీలు ఉంటే ఉష్ణోగ్రతలు..ఈ సారి మాత్రం 24 వరకు టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయి. సిటీ కాంక్రిట్ జంగల్ గా మారటమే ఇందుకు కారణం అంటున్నారు పర్యావరణ అధికారులు. డెవలప్ పేరుతో సిటీలో పార్కులు పూర్తిగా అంతరించి పోతున్నాయి. దీనికి తోడు ప్లాస్టిక్ వాడకం..పొల్యూషన్ పెరగడం వల్లే వర్షాలు పడటం లేదంటున్నారు వెదర్ ఎక్స్ పర్ట్స్. దీంతో పచ్చదనం కనుమరుగై…టెంపరేచర్ రికార్డు స్ధాయికి చేరుకుంటున్నాయంటున్నారు.  చలికాలం ప్రారంభం నుంచే…శీతల గాలులు వీచడం క్రమంగా పెరిగి డిసెంబర్ నెలలో చలిని అత్యధిక స్ధాయికి తీసుకెళతాయి. అయితే ఈ ఏడాది ఉత్తర భారతంలోనూ చలి తీవ్రత అంతగా లేకపోవడంతో అటు శీతల గాలుల ప్రభావం లేదంటున్నారు వెదర్ ఎక్స్ పర్ట్స్. కారణం ఏదైనా…ఈ ఇయర్ హాట్ హాట్ గానే ఉంటుందంటున్నారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy