రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు…ఉత్తర తెలంగాణాలో పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లిలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్సెట్టి పేట హాజీపూర్ లో 29 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిచిపోయింది. దీంతో 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. చిట్యాల మండలం జడల్ పేట గ్రామం దగ్గర కొండెగల వాగు ఉప్పొంగటంతో…జడల పేట, మొరంచ పల్లి ప్రధాన రహదారులపై రాకపోకలు నిచిపోయాయ

జయశంకర్ భూపాల పల్లి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సీతరాంపూర్, వెలుతుర్ల పల్లి గ్రామాల మధ్య మొరంచ వాగు పొంగుతోంది. అటు బోగత జలపాతంకు భారీగా వరద వస్తుండటంతో… పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు అధికారులు. నీరు అధికం కావటంతోనే…జలపాతం వరకు ఎవరికి అనుమతి లేదన్నారు. జీడి వాడు పూర్తి స్థాయిలో నిండిపోయింది. మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి  అతి భారీ వర్షం కురుస్తోంది. శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, మందమర్రి ఓపెన్ కాస్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గొల్లవాగు, రాళ్లవాగు, తుతుంగ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో…40 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ కు వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ 13 గేట్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. లక్షా 22 వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 698 అడుగులకు చేరుకుంది. మరోవైపు ఆర్డీఎస్ ఆనకట్ట పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy