రాష్ట్రపతికి కేసీఆర్ లేఖ

download (4)రాష్ట్రపతికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడానికి వ్యతిరేకంగా ఆయన ఈ లేఖను రాశారు. పోలవరం ముంపు ప్రాంతాల వ్యవహారంలో పార్లమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర కేబినేట్ వ్యవహారించిందని ఆయన లేఖలో పేర్కోన్నారు.

కేంద్ర కాబినేట్ నిర్ణయంతో గిరిజనులతో పాటు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన లేఖలో వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసి చట్టాల్ని ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఈ విషయాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు కేసీఆర్.

ఇక అకాల వర్షాలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గవర్నర్ కు లేఖ సంధించారు గులాబీ బాస్. వడగళ్ళ వానలతో రైతులు పంటను కోల్పోతున్నారని వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి వారికి న్యాయం చేయాలని కేసీఆర్ గవర్నర్ కు లేఖలో విజ్ఞప్తి చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy