రాష్ట్రపతిగా కోవింద్‌ ప్రమాణ స్వీకారం

___________________1500965524భారతదేశం 14వ రాష్ట్రపతిగా  రామ్‌నాథ్‌ కోవింద్‌  ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో మంగళవారం (జూలై-25) మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా పదవీకాలం ముగించుకున్న ప్రణబ్‌ ముఖర్జీ… కోవింద్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో దళిత నేత కోవింద్‌. అంతకు ముందు ఆయన కుటుంబసమేతంగా రాజ్‌ఘాట్‌ చేరుకుని, మహాత్మా గాంధీ సమాధి దగ్గర పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధానులు దేవగౌడ, మన్మోహన్‌ సింగ్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ అగ్రనేత అద్వానీ, రెండు తెలుగురాష్ట్రల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, పౌర, సైనిక విభాగాల ముఖ్యాధికారులు హాజరు అయ్యారు.

కోవింద్‌ కు సాయుధ బలగాలు 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించాయి. రాష్ట్రపతి భవన్ లో కోవింద్‌ కు సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy