రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన కర్ణన్

karnanaకోర్టు ధిక్కరణ కేసులో చిక్కుకున్న కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ఎస్‌.కర్ణన్‌.. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి  లేఖ రాశారు. సుప్రీం కోర్టు విధించిన  జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించామని తెలిపారు ఆయన తరఫు న్యాయవాది. అయితే ఇలాంటి వినతి పత్రం వచ్చినట్టు తమకు తెలియదని రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతికి ఈ-మెయిల్‌ ద్వారా వినతి పత్రం సమర్పించినట్టు న్యాయవాది చెప్పారు. ఈ వినతి పత్రాన్ని న్యాయవాదులు మాథ్యూస్‌ జె నెండుంపర, ఎ.సి.ఫిలిప్‌లు రాశారు. రాజ్యాంగంలోని 72వ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించడంతో పాటు, శిక్షలు తగ్గించడం, రద్దు చేయడం, శిక్ష అమలు కాకుండా నిలిపివేయడం వంటి అధికారాలు ఉన్నాయి. ఆరు నెలల జైలు శిక్ష పడిన కర్ణన్ ను ఇప్పటి వరకు అరెస్ట్ చెయ్యలేదు పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy