రాష్ట్రపతి పాలనలో ఢిల్లీ

download
కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీలో రాజకీయాలు మారిపోయాయి. రాష్ట్రపతి పాలన అమలు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేసిన సిఫార్సుకు కేంద్ర కాబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ రోజు నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలను అమలవుతుంది. దీని గురించి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఢిల్లీలో ఇవాళ్టి నుంచే రాష్ట్రపతి పాలన అమలవుతుందన్నారు.

కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు సంగ్ధిద్దంలో పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీ ముందుకు రాలేదు. దీంతో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి సిఫార్సు చేశారు.

లెఫ్టినెంట్ గవర్నర్ సూచనను పరిశీలించిన రాష్ట్రపతి ప్రణబ్ కేజ్రీవాల్ రాజీనామాను ఆమోదించారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలన్న కేజ్రీవాల్ సూచనను పక్కన పెట్టారు. అసెంబ్లీ రద్దుతో పాటు వెంటనే ఎన్నికలు జరపాలని కేజ్రీవాల్ సలహాను పట్టించుకోలేదు. ఢిల్లీ అసెంబ్లీని ప్రస్తుత స్థితిలోనే ఉంచుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు పంపారు.

మొత్తానికి కేజ్రీవాల్ వేసిన ఎత్తుకు కేంద్రం పై ఎత్తు వేసింది. కేజ్రీవాల్ ఆటలకు చెక్ పెట్టింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy