రాష్ట్రపతి పాలనా? కొత్త ముఖ్యమంత్రా?

download (1)
కిరణ్ రాజీనామా చేస్తారని స్పష్టమవుతోంది. కిరణ్ రాజీనామాతో కాంగ్రెస్ హైకమాండ్ ముందున్న ఆప్షన్స్ ఏంటీ..? సార్వత్రిక ఎన్నికలు ఎంతో దూరంలోలేవు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏం చేస్తుంది. ఇప్పటివరకైతే హైకమాండ్ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రాష్ట్రపతి పాలన విధించడం, రెండోది కిరణ్ స్థానంలో మరో ముఖ్యమంత్రిని నియమించడం. ఎన్నికల వేళ కాంగ్రెస్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తుందా అంటే అనుమానమే. ఇక మిగిలింది తాత్కాలికంగా కొత్త ముఖ్యమంత్రిని నియమించడం. కిరణ్ ప్లేస్ మరొకరిని సీఎం చేసి ఎన్నికల వరకు అత్యవసర ప్రభుత్వాన్ని కొనసాగించే అవకాశముంది. కొత్త ముఖ్యమంత్రిని నియమించాల్సి వస్తే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్న సీమాంధ్ర నేతల్లో ఎవరో ఒకరిని సీఎం చేసే అవకాశం లేకపోలేదు. అధిష్టానం విధేయుల్లో పీసీసీ చీఫ్ బొత్స, మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలున్నారు. తెలంగాణకే సీఎం పదవి ఇవ్వాలని భావిస్తే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ లాంటివారున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సున్నితమైన పరిస్థితుల్లో ఏ ప్రాంతం నుంచి సీఎంను నియమించినా మరో ప్రాంతం వారు మద్దతిచ్చే పరిస్థితిలేదంటున్నారు పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన ప్రభావం ఎన్నికలపై పడనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలు నిర్వహించాలా..? లేక రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలా అనేది కేంద్రం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు. తెలంగాణ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే… ఎన్నికల నిర్వహణకు 45 రోజుల సమయం సరిపోతుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలు నిర్వహించాలన్నా… లేక రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలన్నా తాము సిద్దంగా ఉన్నామంటోంది ఈసీ. ఎలాగూ విడతల వారీగానే ఎన్నికలుంటాయి కాబట్టీ ప్రాబ్లం లేదంటోంది. మొత్తానికి కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్రంలో ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy