రాష్ట్రపతి పోలింగ్ పై TRS ట్రైనింగ్ క్లాస్

KCRఈ నెల 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమయింది టీఆర్ఎస్. ఎన్డీయే అభ్యర్థి కోవింద్ కే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు పడే విధంగా అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్క ఓటు కూడా వృథా కాకుండా పోలింగ్ సరళిపై నేతలకు  అవగాహన కల్పించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో… మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నరు. సీఎం కేసీఆర్ కూడ ఈ మాక్ పోలింగ్ కు హాజరవుతారు.

టీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మంది తొలిసారి ఎన్నికైన వారే. సాధారణ ఎన్నికలకు.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు తేడా ఉంటుంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో .. ఏ చిన్న తప్పుచేసినా ఓటు చెల్లకుండా పోతుంది. అందుకే  ఎలా ఓటు వేయాలో ఎమ్మెల్యేలకు నిపుణుల చేత శిక్షణ ఇప్పిస్తున్నారు కేసీఆర్. ప్రాధాన్యత పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో ఒకటో  ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయాలని ఇప్ప టికే టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు కూడ అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేసీఆర్.

రాష్ట్రపతి ఎన్నికలకు విప్ వర్తించకపోవడంతో…  మాక్ పోలింగ్ క్యాంపులోనే ఎమ్మెల్యేలకు కేసీఆర్ కొన్ని సూచనలు చేసే అవకాశముంది. ఎమ్మెల్యేలందరూ ఈ మాక్ పోలింగ్ కు రావాలని ఇప్ప టికే ఆదేశాలు వెళ్లాయి. ఎంపీలకు కూడా హైదరాబాద్ లోనే మాక్ పోలింగ్ నిర్వహించాలని అనుకున్నారు. అయితే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సూచనలతో ఢిల్లీలో ఆదివారం ఎన్డీయే నిర్వహించే మాక్ పోలింగ్ లో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొంటారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy