రాష్ట్రపతి భవన్ లో రెండురోజుల గవర్నర్ ల కాన్ఫరెన్స్ ప్రారంభం

govఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రెండురోజుల గవర్నర్ ల కాన్ఫరెన్స్ సోమవారం(జూన్-4) మొదలైంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, అన్ని రాష్ట్రాల గవర్నర్ లు, లెఫ్టినెంట్ గవర్నర్ లు హాజరయ్యారు. ఈ రెండురోజుల కాన్ఫరెన్స్ లో వివిధ సెషన్స్ లో ముఖ్యమైన ఇష్యూలపై చర్చించనున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ ల సదస్సులో ఇది 49వ కాన్ఫరెన్స్  కాగా, రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన జరుగుతున్న రెండో కాన్ఫరెన్స్. 1949 లో రాష్ట్రపతి భవన్ లో మెదటిసారిగా అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి.రాజగోపాలచారి అధ్యక్షతన మొదటి కాన్ఫరెన్స్ జరిగింది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy