
రంజాన్ ముబారక్ చెప్పుకున్నారు. హైదరాబాద్ లోని అన్ని సెంటర్లలో రంజాన్ పండుగను గ్రాండ్ గా జరుపుకుంటున్నారు ముస్లింలు. చిన్న, పెద్ద అంతా కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. మీరాలం ఈద్గా దగ్గర ప్రార్థనలు జరిపారు ముస్లిం సోదరులు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.