కేంద్రం చేసింది ఏమీలేదు: కవిత

Screen Shot 2016-01-09 at 12.27.55 PMజీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలని టీఆర్‌ఎస్ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ హైదరాబాద్‌కు ఏదో చేస్తాడని బీజేపీ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల్లో ఎంతో మంది ఆంధ్రా వాళ్లు లబ్ధిపొందారని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. హైదరాబాద్ ను వేరే పార్టీ చేతిలో పెట్టి అభివృద్ధిని ఆశించలేమన్నారు. విపక్షాలను ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు ఎంపీ కవిత. గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల తాగు నీటి సమస్యను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని చెప్పారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy