రాష్ట్రానికి మరో అవార్డు

KCR-announces-Telangana-State-Awardsజాతీయస్థాయిలో రాష్ట్రానికి మరో అవార్డు దక్కింది. సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై ఇండియా టుడే మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. డిసెంబర్ 6న ఢిల్లీలో అవార్డును ఇవ్వనున్నారు.

తెలంగాణకు మరో అరుదైన ఘనత దక్కింది. సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా రాష్ట్రంగా నిలిచింది. ఈ మధ్యే CNBC జాతీయ వాణిజ్య నాయకత్వ అవార్డుకు సెలెక్ట్  అయిన స్టేట్ కు ఇప్పుడు ఇండియాటుడే అవార్డు లభించింది.. సంక్షేమ పథకాలతోపాటు సమగ్రాభివృద్ధిలో మంచి ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దేశంలోని  29 రాష్ర్టాల్లో అమలవుతున్న పథకాలు, వాటి అమలు తీరును పరిశీలించి తెలంగాణను అవార్డుకు ఎంపికచేసింది ఇండియా టుడే మ్యాగజైన్.  ఢిల్లీలో నవంబర్ 6న  జరిగే ఇండియా టుడే- స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్-2015 ప్రోగ్రాంలో  అవార్డును అందజేయనున్నారు.  అవార్డును తీసుకునేందుకు రావాలని సీఎం కేసీఆర్ ను ఆహ్వానించింది ఇండియా టుడే యాజమ్యానం.

పథకాలను నూటికి నూరు శాతం పక్కాగా అమలు చేస్తున్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను ఎంపిక చేసింది ఇండియా టుడే. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాకు తగినట్లు బ్యాంకు శాఖలు ఎన్ని ఉన్నాయి? పోస్టాఫీసులు, టెలిఫోన్ కనెక్షన్లు, మొబైల్స్, బ్రాడ్ బ్యాండ్, వంట గ్యాస్ కనెక్షన్లు, పంచాయతీ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం, సమగ్రాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను   జూన్ నుంచి పరిశీలించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీ, వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితులకు భూ పంపిణీ, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం అంశాలు  తెలంగాణను ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. కొన్ని స్కీమ్స్ పక్క రాష్ర్టాలకు  స్ఫూర్తిగా నిలిచాయి. దీంతో తెలంగాణ  ఏర్పడిన ఏడాదిన్నరలో అనేక అవార్డులు దక్కాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy