రాష్ట్రానికి మరో 16 కొత్త ఇండస్ట్రీస్

imagesరాష్ట్రానికి  మరో 16 కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి.దీంతో సుమారు 1000 కోట్లవరకూ పెట్టుబడులు రానున్నాయి.కొత్త పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత మన స్టేట్ లో పెట్టబడులు పెట్టేందుకు పలు పరిశ్రలము ఆసక్తిని చూపుతున్నాయి.ముఖ్యమంత్రి చైనా పర్యటనతో పలు సంస్థలు పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.50 వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్ప్పటికీ సుమారు 1000 కోట్లు పెట్టుబడులు మాత్రం గ్యారంటీ అని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. వారం రోజుల క్రితం  48 మంది చైనా ప్రతినిధులతో  ఫలక్ నుమా ప్యాలెస్ లో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి.స్టేట్ లో  రెండు పరిశ్రమలను పెట్టేందుకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో డ్రైపోర్టు ఏర్పాటు ఒకటి కాగా, మరొకటి ప్రీప్యాబ్ కాంక్రీట్ తయారీ పరిశ్రమ

మరోవైపు ఈ మద్యనే సిఎస్ రాజీవ్ శర్మ ప్రాన్స్లో పర్యటించి వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలను ఆయనకోరారు. ఇప్పటికే మన స్టేట్ లో పెట్టబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకుంటున్నాయి..ఇండస్ట్రియలిస్టులకు ఇబ్బందుల్లేకుండా  సిఎం పేషిలో చేజింగ్ సెల్ ఏర్పాటు చేశారు. సిఎంవో కార్యదర్శి శాంత కుమారి దీనిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదటి దఫాలో 17 కంపనీలు 1500 కోట్లతో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.రెండో ఫేజ్ లో 19 కంపనీలు 1087 కోట్ల పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. మూడో ఫేజ్ లో  1100 కోట్లతో 17 పరిశ్రమల ఏర్పాటు చేయనున్నరు.నవంబర్ ఫస్ట్ వీక్ లో  మరో 16 కొత్త ఇండస్ట్రీస్  1000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు సిఎంవో సెక్రటరీ  శాంత కుమారి తెలిపారు. కొత్త పరిశ్రమలతో పాటు పెండిగ్ లో ఉన్న పరిశ్రమలకు  కేటాయించిన భూములు వంటి అంశాలపై పరిశ్రమలశాఖాధికారులు కాన్సన్ట్రేషన్ చేశారు.ఇప్పటి కే కొన్ని పరిశ్రలమకు కేటాయించిన భూములను వెనక్కుతీసుకున్నారు.వీటి స్థానంలో కొత్త పరిశ్రమలకు కేటాయించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఇక నిజాం షుగర్ ప్యాక్టరీ,సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు తో పాటు పలు మాత పడిన పరిశ్రమలను రీ ఓపెన్ పై కసరత్తు చేస్తోంది. కొత్త పరిశ్రమలను స్టేట్ ఏర్పాటు చేసేందుకు రాయితీలు కల్పిస్తూనే …..మూత పడిన ప్యాక్టరీలను రీ ఓపెన్ చేయాలనే ఆలోచన ను కూడా  ప్రభుత్వం చేస్తోంది..తద్వారా నిరుద్యోగులకు  ఉపాధి కల్పించాలనే ఆలోచన లో ఉంది ప్రభుత్వం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy