రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన వస్తే ఎలా…?

download (2)
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే ఏం జరుగుతుంది. పాలనా వ్యవహారం ఎలా ఉంటుంది. శాంతి భద్రతలను ఎవరు అమలు చేస్తారు ? రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉందా ? ప్రెసిడెంట్ రూల్ వస్తే కేంద్రం చేతిలోకి రాష్ట్రం వెళ్తుంది.

నల్లారి రాజీనామాతో…రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన తప్పేట్లు లేదు. రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసులే కీలకం. అయితే పరిస్థితులు మాత్రం ప్రెసిడెంట్ రూట్ చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ కు కూడా మరో ఆప్షన్ కనిపించడం లేదు. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ముఖ్యమంత్రిని నియమించే సాహసం కాంగ్రెస్ చేసే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్ కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం రాష్ట్రపతి పాలనే.

గవర్నర్ సిఫారసుతో కేంద్రం… ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తుంది. ప్రెసిడెంట్ రూల్ వస్తే అయితే అసెంబ్లీని రద్దు చేయడమో… సుప్తాచేతనావస్థనలో ఉంచడమే చేస్తారు. కానీ ఇలా చేయడానికి గవర్నర్ పంపే నివేదికే కీలకం. రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తే.. పాలన మొత్తం గవర్నర్ చేతుల్లోకి వెళ్తుంది. గవర్నర్ కు అధికారాలున్నా …కేంద్ర హోంశాఖ అన్ని విషయాలు పర్యవేక్షిస్తుంది. గవర్నర్ డెసిషన్ కు కేంద్ర హోం శాఖ ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటుంది. బడ్జెట్ సంబంధిత విషయాల్లోకి వస్తే పార్లమెంటే నిర్ణయమే ఫైనల్. రాష్ట్రపతి ప్రతినిధిగా పాలన వ్యవహారాల్ని గవర్నర్ అమలు చేస్తారు.

ప్రభుత్వ వ్యవస్థ మొత్తం గవర్నర్ కంట్రోల్ లోకి వస్తుంది. పాలనలో అధికారులే కీలకం. అయితే గవర్నర్ పర్మిషన్ తోనే అమలు జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ పర్యవేక్షణలో అధికారులు విధులు నిర్వహిస్తారు. రాష్ట్రపతి పాలనలో అధికార విధుల్లో తేడాలు లేకపోయినా….గవర్నర్ కు జవాబుదారిగా ఉంటారు. వివిధ ప్రభుత్వ శాఖల నిర్వహణకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు గవర్నర్ ఒక బృందాన్ని నియమించుకోనే అవకాశం ఉంది.

రాష్ట్రపతి పాలన విధిస్తే రెండు నెలల లోపు పార్లమెంట్ ఆమోదం పొందాలి. రాష్ట్రపతి పాలన ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. పరిస్థితులు చక్కబడితే ఈ లోపే రద్దు చేయోచ్చు. లేదంటే మరో ఆరు నెలలు పొడగిస్తారు. ఇలా ఆరు నెలలకొకసారి పొడగించుచ్చన్న మాట. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎలక్షన్ కమిషన్ సిఫారసు చేస్తే కూడా రాష్ట్రపతి పాలనను కొనసాగించే అవకాశాలున్నాయి.

1973లో ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు. జై ఆంధ్ర ఉద్యమ నేపద్యంలో పీపీ నరసింహరావు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాతో …మళ్లీ రాష్ట్రపతి పాలన దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్తే అవకాశాలు ఉన్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy