రాష్ట్రానికి రూ.791 కోట్ల కరవు భత్యం

droughtరాష్ట్రానికి కరువు సాయంపై నిర్ణయం తీసుకుంది కేంద్రం.  791 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తదితరులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ..కరువు సాయంపై క్లారిటీ ఇచ్చింది. కరువుపై రాష్ట్రం ప్రతిపాదనలు, కరువు అధ్యయన బృందం రూపొందించిన నివేదికపై డిస్కషన్ చేసి సాయాన్ని ప్రకటించింది కేంద్రం.  జాతీయ విపత్తు సహాయక నిధి నుంచి ఈ నిధు లు విడుదల కానున్నాయి. కేంద్రం ఇప్పటివరకు ఏడు రాష్ర్టాలకు కరువుసాయాన్ని ప్రకటించింది. కొన్ని రాష్ట్రాలకు కేంద్రం..కరువు సాయం ప్రకటించిన తెలంగాణను పక్కనపెట్టింది. వెంటనే కరువు సాయం చేయాలని..సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ.. వ్యవసాయ మంత్రి రాధామోహన్ కు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు.  మంత్రి హారీష్ రావు టీం కూడా..కేంద్ర వ్యవసాయం మంత్రికి కరువు సాయంపై రిక్వెస్ట్ చేశారు. వారం రోజుల్లో పూర్తి స్థాయి కరవు సాయం ప్రకటిస్తామన్న కేంద్రం…రాష్ట్రానికి 791 కోట్ల సాయం అందించింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు కూడా ఇంత భారీ మొత్తంలో కరవు సాయం ఎప్పుడు ఇవ్వలేదన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్. రాష్ట్రంలోని కరువుపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి.. గత నెలలో  కేంద్ర వ్యవసాయమంత్రికి నివేదిక ఇచ్చారు.  రాష్ట్రంలో 231 గ్రామీణ మండలాల్లో కరువుందని తెలిపారు.  దాదాపు 12వందల కోట్ల కరువు సాయం వస్తుందని అనుకున్నా…4వందల కోట్లకు కోతపెట్టి… .791కోట్లతో సరిపెట్టింది కేంద్రం.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy