రాష్ట్ర అవసరాల కోసమే అప్పులు: సీఎం కేసీఆర్‌

kcr
ప్రభుత్వంపై పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం మాట్లాడారు. విపక్షాల ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. గవర్నర్‌ స్పీచ్‌లో అసత్యాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర అప్పులపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చెప్పిన లెక్కల్లో నిజం లేదన్నారు. ఆయన అడ్డగోలుగా మాట్లాడటం సరైంది కాదన్నారు. రూ.2లక్షల కోట్ల అప్పులు తెచ్చామంటున్నారంటున్నారని, ఇది పూర్తిగా అబద్ధమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నెల ఆదాయం రూ.10వేల 500 కోట్లు ఉందన్నారు. అలాంటప్పుడు రూ.2లక్షల కోట్ల అప్పు ఎలా చేయగలమని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. అంత రుణం ఎవరూ ఇవ్వరన్నారు. రుణ పరిమితి దాటగానే వాళ్లే కట్‌ చేస్తారని వివరించారు. తెలంగాణ ఏర్పడే వరకు రాష్ట్ర అప్పులు రూ.72వేల కోట్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మన పాత, కొత్త అప్పులు రూ.1.42లక్షల కోట్లు ఉన్నాయని తెలిపారు. అవసరం మేరకే అప్పులు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రానికి ఎక్కడ, ఎన్ని అప్పులున్నాయో RBI దగ్గర లెక్కలున్నాయన్నారు. నాలుగేళ్లలో రాష్ట్ర ఖర్చులు 1,24,966 కోట్లు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాల ఆరోపణలు, నిరసనలు చేస్తున్నాయని ఆరోపించారు. పల్లె ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy