రాష్ట్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు

Cabinet-Meetingరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘంగా 11 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై డీప్ డిస్కషన్ చేసింది. ఉద్యోగులకు వరాలు ప్రకటించింది. బడ్జెట్, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషపన్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జీతాల పెంపు, గ్రేటర్ ఎన్నికలు…. పనిలో పనిగా విపక్షాలపై విమర్శలు…. ఇలా అన్నింటిపై చర్చించింది మంత్రివర్గం. నిన్న ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ మధ్యలో చిన్న, చిన్న విరామాలతో రాత్రి 9.30 వరకు జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్. గత బడ్జెట్ కంటే ఈసారి అదనంగా 15 శాతం కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఇక ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు సీఎం. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న సీఎం రిజర్వేషన్ పద్దతిలో ఈ జనవరి లాస్ట్ వరకు ఆ పని పూర్తిచేస్తామన్నారు. అటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగానే పెంచింది ప్రభుత్వం. అటు DSC కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగుకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం. త్వరలో 15 వేల 628 టీచర్ పోస్టులన భర్తీ చేస్తామని చెప్పారు.  అటు హెయిర్ కట్ సెలూన్లకు డొమెస్టిక్ కరెంట్ చార్జీలను అమలుచేస్తామన్నారు. ఇక పాలమూరు మెడికల్ కాలేజ్ లో ఖాళీగా ఉన్న 462 పోస్టులను భర్తీ చేయాలని డిసైడైంది ప్రభుత్వం.

అటు ట్రాఫిక్ పోలీసులకు పొల్యూషన్ అలవెన్స్ ఇస్తామన్నారు సీఎం. ఉద్యోగి చనిపోయిన వారంలోనే కారుణ్య నియామకాలు కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ శాఖలోఎంప్లాయిలను పర్మినెంట్ చేస్తామన్నారు. వాణిజ్య పన్నులు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, ట్రాన్స్ పోర్ట్, మైన్స్ లలో ఆదాయం పెంపుపై డిస్కస్ చేశారు సీఎం. అటు ఇరిగేషన్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై కూడా భేటీలో మాట్లాడినట్టు తెలుస్తోంది. అనుకున్న టైమ్ లో ప్రాజెక్టులు కంప్లీంట్ చేస్తే  1.5శాతం ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. రేస్ కోర్స్ , చంచల్ గూడ జైల్ ను కూడా తరలింపుకు ఓకే చెప్పింది ప్రభుత్వం. ఈ ప్లేస్ లో గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్లాన్ చేశారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి మైనార్టీల కోసం 30 బాలికల, 30 బాలుర రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది క్యాబినెట్. 11 గంటల కేబినెట్ భేటీని టూకీగా 30 మినిట్స్ లో రిపీట్ చేశారు సీఎం. గ్రేటర్ లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగరకడం ఖాయమంటున్నారు సీఎం కేసీఆర్. చేస్తున్న అభివృద్ధి…. భవిష్యత్ లో చేయబోయే పనులే తమను గెలిపిస్తాయంటున్నారు ముఖ్యమంత్రి. రాజధానిలో బతకడానికి వచ్చిన ప్రతీ ఒక్కరూ హైదరాబాదీలేనన్నారు సీఎం. కేబినెట్ మీటింగ్ లో హైదరాబాద్ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూస్తున్నామని చెప్పారు కేసీఆర్. ఈ నెలాఖరు వరకు గ్రేరట్ ఎన్నికలు జరిగే చాన్సుందన్న సీఎం ఎవరికి ఓటేస్తారన్నది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పనిలో పనిగా గ్రేటర్ అభివృద్ధిని వివరించారు సీఎం. GHMC ప్రజలకు వరాలు కురిపించారు. రాజధానిలో 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నీటి బిల్లుల బకాయిలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు కేసీఆర్. ఆస్తి పన్నును… 1200 రూపాయల నుంచి 101 రూపాయలకు తగ్గిస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్ల కోసమే వరాలు కురిపిస్తున్నారన్న విమర్శలను కొట్టి పారేశారు. అధికారంలో ఉన్న పార్టీలు అడ్వాంటేజ్ తీసుకోవడం కామన్ అన్నారు సీఎం.

రాజధానిలో తాగునీటి సమస్యలు తీరుస్తామన్న ముఖ్యమంత్రి ….ఇందుకోసం ప్రత్యేకంగా రెండు భారీ రిజర్వాయర్లు నిర్మిస్తామని చెప్పారు. 40 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో… శామీర్ పేట్ దగ్గర ఒకటి, రాచగొండ దగ్గర మరో రిజర్వాయర్ నిర్మించనున్నారు.  కేబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూనే.. విపక్షాలను టార్గెట్ చేశారు సీఎం. హైదరాబాద్ ను డెవలప్ చేశామని చెప్పుకుంటున్న నేతలు… కనీసం తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక రిజర్వాయర్లు నిర్మించలేక పోయారని విమర్శించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy