రాష్ట్ర పండుగలా.. ఓయూ సెంటినరీ సెలబ్రేషన్స్: కడియం

Kadiyam-Srihariఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటినరీ సెలబ్రేషన్స్ పై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఈనెల 26న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఓయూ సెంటినరీ బ్లాక్ ను ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలియజేశారు డిప్యూటీ సీఎం.

ఓయూ ఉత్సవాలకు రూ. 200 కోట్లు కేటాయించామన్నారు విద్యాశాఖ మంత్రి కడియం. విద్యార్థుల హాస్టల్స్, అకాడమిక్ బ్లాక్స్ లకు మరమ్మత్తులు నిర్వహిస్తున్నామన్నారు. వీటి కోసం నిధులు విడుదల చేశామని తెలిపారు. ఒక రాష్ట్ర పండుగలా ఓయూ సెలబ్రేషన్స్ జరుపుకోవాలన్నారు డిప్యూటీ సీఎం కడియం. ఓయూ ఉత్సవాలకు అందరూ సహకరించాలని కోరారాయన.

ఈ నెల 27న ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంటుందన్నారు కడియం. ఓల్డ్ స్టూడెంట్స్ భేటీకి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు హాజరవుతారన్నారు. వీసీల సదస్సును కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రారంభిస్తారన్నారు.

రాష్ట్ర చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా ఆర్ట్స్ కాలేజీ ఎదుట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు మంత్రి. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో ఆచార్య పోస్టులను భర్తీ చేస్తామన్నారు మంత్రి కడియం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy