రాష్ట్ర పర్యటనలో…రెండో రోజు బిజి బిజిగా రాహుల్

రెండో రోజు బిజిగా ఉన్నారు రాహుల్ గాంధీ.  ఉదయం హోటల్ హరితప్లాజాలో 36వేల 600ల మంది బూత్ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు రాహుల్ గాంధీ. శక్తి యాప్ రిజిస్ట్రేషన్, పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలపై కార్యకర్తలతో డిస్కషన్ చేశారు.  తర్వాత పార్టీ సీనియర్ లీడర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో  రాజకీయ పరిస్థితులు, నాయకుల మధ్య సమన్వయం, పార్టీ భవిష్యత్ ప్రణాళిక తదితర అంశాలను లీడర్లతో విడిగా డిస్కషన్ చేశారు.

15నిమిషాలు LDMRCపై ప్రజంటేషన్ ఇచ్చారు నేతలు. Charms ద్వారా వేలాది మందితో మాట్లాడారు రాహుల్. ఐదు   LDRMC నియోజకవర్గాల నుంచి రాహుల్ తో మాట్లాడారు బూత్ కమిటీ అధ్యక్షులు. అచ్చంపేట్, చొప్పదండి, డోర్నాకల్ నేతలతో కనెక్ట్ అయ్యారు. దాదాపు 20 నిమిషాలు బూత్ కమిటీ సభ్యులతో టెలికాన్ఫిరెన్సులో మాట్లాడారు రాహుల్ గాంధీ. ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతోనే ..ఎన్నికల్లో నష్టపోయామని కార్యకర్తలు చెప్పినట్టు తెలుస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి కాలేదని చెప్పినట్టు టాక్.

దళితులు, గిరిజనులకు మూడు ఎకరాలు భూపంపిణీ  అమలు కాలేదని చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని కార్యకర్తలకు చెప్పారు రాహుల్ గాంధీ .

మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలను త్వరగా వేయాలని రాహుల్ ను కోరారు సీనియర్ లీడర్లు. గత ఎన్నికల్లో మేనిఫెస్టో ఆలస్యంగా ప్రకటించడం వల్లే ఓడిపోయామని..పార్టీ పథకాలు కార్యకర్తలకు సరైన టైంలో చేరలేదని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు నేతలు. మేనిఫెస్టో ముందుగా ప్రకటించడంపై పరిశీలిస్తామని నేతలకు హామీ ఇచ్చారు రాహుల్. కో- ఆర్డినేషన్ కమిటితో నేతలమద్య సమన్వయం చేయొచ్చని రాహుల్ ని కోరారు నేతలు. 20 నుంచి 26 నియోజకవర్గాల్లో సింగిల్ అభ్యర్థులు ఉంటారని, అటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను వెంటనే ప్రకటించాలని రాహుల్ కు విజ్ఞప్తి చేశారు. నేతల కోరికపై రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. లీడర్ల మధ్య అభిప్రాయ భేదాలు, సమన్వయం పై నేతలతో విడివిడిగా మాట్లాడారు రాహుల్. పార్టీలో చేరికల వల్ల ఇప్పటికే పార్టీలో ఉన్నవారికి ఎదురవుతున్న ఇబ్బందులను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు నేతలు. ఎవరైనా పార్టీలో చెరొచ్చు కానీ పార్టీలో ఉన్న వారిని ఇబ్బందులకు గురిచేయకుండా..ఆయా ప్రాంతాల నేతలతో చర్చించాలని రాహుల్ కు విజ్ఞప్తి చేశారు నేతలు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy