రాష్ట్ర పార్టీ నిర్మాణం బాధ్యత కేటీఆర్ దే : కేసీఆర్

తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన TRS పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేడర్ కు సూచనలు ఇచ్చారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకుసాగాలని ఆయన సూచించారు. నియోజకవర్గాలను ఎమ్మెల్యేలు శాసించొద్దు.. పార్టీ శాసించాలి అన్నారు. ఒకరికి ఒకటే పదవి ఉంటుందని.. జోడు పదవులు కుదరదని అన్నారు. ప్లీనరీలోగా పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు కేసీఆర్. పార్టీ వందేళ్లు నిలబడేలాగా శాస్త్రీయ నిర్మాణం జరగాలన్నారు. పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య గ్యాప్ భర్తీ చేయాలన్నారు కేసీఆర్. రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఇంచార్జీలను నియమించాలని నిర్ణయించారు.

రాష్ట్ర పార్టీ నిర్మాణం బాధ్యత కేటీఆర్ దే : కేసీఆర్

కేటీఆర్ వర్కింగ్ ప్రెసిండెంట్ గా రోజూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు కేసీఆర్. నెలకు 18 రోజులు, రోజు 3 గంటలు కేటీఆర్ .. ప్రజలకు, పార్టీ వర్కర్లకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనీ.. అత్యాధునిక టెక్నాలజీని అందుకోవాలని… అన్ని విభాగాలు, అనుబంధ సంఘాలు కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్ర కార్యవర్గంలోని వాళ్లకు ఎమ్మెల్సీలుగా మొదటి ప్రాధాన్యత ఉంటుందనీ.. అయితే ఏదో ఒక పదవి మాత్రమే వుంటుందని చెప్పారు. “నేను, కేకే జాతీయ రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటాం. కాబట్టి కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించాను. పార్టీ నిర్మాణ బాధ్యతలను కేటీఆర్ చూస్తారు. రేపు శనివారం మధ్యాహ్నం మరోమారు సమావేశం అవుతామని… పార్టీ నిర్మాణం ఏ రీతిలో ఉండాలో నిర్ణయించడానికి సమావేశం కావాలని నిర్ణయించారు.

శనివారం కేటీఆర్ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. సైద్ధాంతికంగా జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధంగా ఉండాలని స్టేట్ కేడర్ కు పిలుపునిచ్చారు కేసీఆర్. ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన అన్ని హామీలు ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికే.. వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించామని.. ప్రభుత్వానికి పార్టీకి అనుసంధాన కర్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారని చెప్పారు. ప్రభుత్వం, పార్టీ జోడు గుర్రాలుగా ముందుకు వెళ్లాల్సి వుందన్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy