రాష్ట్ర ప్రభుత్వానికి CNBC అవార్డు

Telangana-State-320x180తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. CNBC జాతీయ వాణిజ్య నాయకత్వ అవార్డుకు సెలెక్ట్ అయింది. త్వరలో ముంబాయిలో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. సీఎం కేసీఆర్ కు CNBC ఎండీ లెటర్ రాశారు. అవార్డుకు ఎంపికైనందుకు ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.

2015 ఏడాదికి తెలంగాణ ప్రామిసింగ్ స్టేట్ గా ఎంపికైంది. ఇండియన్ బిజినెస్ లీడర్స్ అవార్డుకు .. జాతీయ వాణిజ్య నాయకత్వ పురస్కారాల కమిటీ ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది.  ఈ సమాచారం తెలుపుతూ..సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు CNBC టీవీ-18 ఎండీ షరీన్ భాన్. గత 11 ఏళ్లుగా ఐబీఎల్ఏ అవార్డు ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పారిశ్రామిక, వాణిజ్యరంగంలో డెవలప్ మెంట్, వృద్దిరేటు, మార్కెటింగ్ తో పాటు వివిధ రంగాల్లోని వారికి నిజాయితీ, సమగ్రత చిత్తశుద్దితో సేవలందించే వారిని ప్రోత్సహించేందుకు..ఈ అవార్డును అందిస్తున్నామన్నారు CNBC ఎండీ.  అన్ని అంశాల్లోనూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని, అత్యున్నత ప్రమాణాలను చాటుతోందని అభిప్రాయపడింది జ్యూరీ కమిటీ. త్వరలో ముంబైలో జాతీయ వాణిజ్య నాయకత్వ అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రొగ్రామ్ కు అటెండై అవార్డు అందుకోవాలని సీఎం కేసీఆర్ ను కోరారు CNBC ఎండీ. కేసీఆర్ నాయకత్వ పటిమ, ఆయన ఆధ్వర్యంలో సాధించిన విజయాలపై త్వరలోనే ప్రసారం చేస్తామన్నారు.  అవార్డుకు సెలెక్ట్ కావడంపై ఆనందం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy