ధూమ్ ధామ్ తో దుమ్ము లేపుతారంట..!

unnamedతెలంగాణ తొలి బర్త్ డేకి వారం రోజుల వేడుక

ప్రతి జిల్లాలో ప్రోగ్రామ్స్

పది రోజులుగా ప్రాక్టీస్

తెలంగాణ ధూంధాం కళాకారులు మరోసారి ప్రదర్శనలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తి అవుతుండటంతో.. సెలబ్రేషన్స్ కు సిద్ధమౌతున్నారు. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం రోజు ఆటాపాటలతో సంబురాలు చేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా సంబురంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 రాత్రి నుంచి జూన్ 7 వరకు కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర సంస్కృతి అద్దంపట్టేలా వివిధ ప్రదర్శనలు చేయనున్నారు. చేతివృత్తులు, డప్పు వాయిద్యాలు, డోలు, కొమ్ము, కోయ, బంజారా నృత్యాలు ప్రదర్శించనున్నారు. వీటికి సంబంధించి తెలంగాణ సాంస్కృతిక సారధి భవన్ లో కళాకారులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రభుత్వం నియమించిన 550 మంది కళాకారులు బృందాలుగా విడిపోయి .. ఒక్కో బృందం ఒక్కో అంశంపై ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఉద్యమకారులుగా ఇన్నాళ్లు ప్రదర్శనలు ఇచ్చిన తాము.. ప్రభుత్వ ఉద్యోగులుగా తమ కళను ప్రజలకు చూపిస్తామంటున్నారు కళాకారులు. జానపదాలు, పాటలుపై లాస్ట్ టెన్ డేస్ గా ప్రాక్టిస్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సత్తా చూపిస్తామంటున్నారు కళాకారులు. కళాకారుల ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని చాటుతామంటున్నారు నిర్వాహకులు. కాస్టూమ్స్, ప్రాపర్టీతో ఎక్కడా తగ్గకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర తొలి ఆవిర్భావ వేడుకల్లో కళాకారుల ప్రదర్శన హైలెట్ గా ఉండేలా ప్రాక్టీస్ చేస్తున్నారు కళాకారులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy