రాష్ట్ర వ్యాప్తంగా బర్త్ డే వేడుకలు అదుర్స్..!

telanganaGovernmentపార్టీలకు అతీతంగా అందరూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. అమరుల త్యాగాలకు తగిన ఫలితం రావాలంటే …బంగారు తెలంగాణ నిర్మాణం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ కార్యాయంలో నిర్వహించిన రాష్ట్ర అవరతణ దినోత్సవాల్లో పాల్గొన్న దత్తాత్రేయ… రాష్ట్రాభివృద్దికి సహకారాన్ని కేంద్రం అందిస్తోందన్నారు.

తెలంగాణ ఏర్పాటు  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలువే అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రం ఇచ్చారన్నారు. రాష్ట్ర అవతరణ దినోవత్సవ సందర్భంగా గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజల కృతజ్ఞతా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు.

తెలంగాణను సాధించిన అసలైన నాయకులు అమరవీరులేనన్నారు యూనైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క. గన్ పార్క్ దగ్గర తన పాటతో అమరులకు నివాళులర్పించారు.  బంగారుతెలంగాణకు మొదటి పునాది అమరుల వేసారని తెలిపారు. 60 ఏళ్ల కలల కోసం కన్నీరైపోయిన వీరులను నాయకులు మరిచిపోతున్నారన్నారు. ఉద్యమ లక్ష్యం నెరవేరే వరకు ప్రజలు పోరాటం చేస్తూనే ఉంటారన్నారు.  విమలక్క.

ఖమ్మంలో రాష్ట్ర అవతర దినోత్సవ  వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెవిలియన్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసిన  తుమ్మల… వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వాళ్లకు అవార్డులు అందజేశారు. ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర మన్నారు. ఉత్సవాల్లో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు అధికారులు. ఆలయంలో జాతీయ జెండాను ఎగరేసి… అమరులను త్యాగాలను గుర్తు చేసుకున్నారు అధికారులు.

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్  టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్  లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ చరిత్రను గుర్తుచేసుకున్నారు.  బంగారు తెలంగాణ కోసం కష్టపడతామన్నారు. అమర వీరుల త్యాగం లేనిదే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గ్రాండ్ నిర్వహించారు సింగరేణి కార్మికులు. గనుల జాతీయపతాకాన్నిఎగరేశారు కార్మిక సంఘాల నాయకులు. కేక్ కట్ చేసి, సీట్లు పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్రను గుర్తు చేశారు కార్మికులు.

నల్లగొండ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ చౌక్  దగ్గర జేఏసీ ఆధ్వర్యంలో అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళుల్పించారు.  ఆ తర్వాత పోలీసు హెడ్ క్వార్టర్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు హాజరయ్యారు.

నిజామాబాద్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గ్రాండ్ నిర్వహించారు బీజేపీ నాయకులు. పార్టీ ఆఫీసులో జెండా ఎగరేశారు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ. ప్రభుత్వం పరిపాలన మీద దృష్టిపెట్టాలన్నారు యెండల. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేయడం లేదని ఆరోపించారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy