రాష్ట్ర వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

Screen Shot 2014-02-27 at 12.04.00 PMశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివాలయాలు శివనామ స్మరణతో కిటకిటలాడుతున్నాయి. పంచారామాల్లో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వరుని దేవాలయం శివనామంతో పరవశిస్తుంది. అంతే కాకుండా పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు శివాలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినాన జాగరం చేస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

ఇక విశాఖలోనూ శివరాత్రి సందడితో ఉదయం నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు.ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉపవాసదీక్షతో భక్తులు శివదర్శనం చేసుకునేందుకు ఆలయాలకు చేరుకోని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలోని శైవక్షేత్రాలల్లో ప్రసిధ్ధమైన వేములవాడ భక్తజనంతో కిటకిటలాడుతోంది . శ్రీ రాజ రాజేశ్వర స్వామికి రాష్ట్రప్రభుత్వం తరపున ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ పట్టువస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి జాతర మహాత్సవాలకు అన్ని జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలనుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

హైదరాబాద్ లోని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయల్లో క్యూ కట్టారు. జాగారాల కోసం ప్రత్యేక ఏర్పాటు జరుగుతున్నాయి. మణికొండ, పుప్పలగూడ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కీసర శివనామస్మరణతో మార్మోగుతోంది. ఉదయం నుంచే భక్తులు వేలాదిగా కీసర చేరుకోని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ప్రసిధ్ధ శైవక్షేత్రమైన వరంగల్ వేయిస్థంబాల గుడిలో భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో రామలింగేశ్వరున గుడి మారుమోగింది. తెల్లవారు జామునుంచే ప్రత్యేక పూజలు నిర్వహించడంతో భక్తులు పెద్ద ఎత్తున గుడికి చేరుకున్నారు.

గుంటూరు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోటప్పకొండలో కోలువై ఉన్న త్రికోటేశ్వురుడిని దర్శించుకేందుకు భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు చేరుకున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy