రాష్ట్ర వ్యాప్తంగా 4జీ సేవలు..

download (5) తెలంగాణ రాష్ట్రం 4జీ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4జీ సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.  హైదరాబాద్ ను వైఫై సిటీగా మార్చేందేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమీషనర్ హాజరైయ్యారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. వైఫై, 4జీ కనెక్టివిటీతో పాటు మిగతా అంశాలపై వీరు చర్చించారు. అక్టోబర్ లో జరిగే అంతర్జాతీయ మేయర్ల సదస్సులోపు 4జీ సేవలు హైదరాబాద్ లో స్టార్ట్ చేయాలని సీఎం  కేసీఆర్ ఆదేశించారు. ఐటీ సేవల్లో రాష్ట్రాన్ని ఫస్ట్ ప్లేస్ లో నిలపాలని ప్రభుత్వం భావిస్తుంది.

ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రపంచంలోని కొన్ని నగరాల్లో అమలౌతున్న తీరును పరిశీలించారు. ఇక వైఫై కనెక్టివిటీని దాదాపు 6నెలలు ఫ్రీగా ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.4100 కోట్లతో 4జీ సేవలు స్టార్ట్ చేసేలా సర్కార్ కసరత్తులు చేస్తుంది.  3 దశల్లో ఈ సేవలను రాష్ట్ర ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. తొలి దశలో 6 కార్పొరేషన్లు, 35 మున్సిపాలిటీల్లో అమలు చేయాలని, రెండో దశలో మిగతా పట్టణాలతో పాటు 240 మండలాల్లో అమలు చేయనున్నారు. 3 దశలో రాష్ట్ర వ్యాప్తంగా 4జీ సేవలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy