రాష్ట్ర సమస్యలను పరిష్కరించండి

ktrహస్తినలో బిజీగా గడిపారు రాష్ట్రమంత్రులు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమై…రాష్ట్ర సమస్యలపై చర్చించారు. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజును కలిశారు మంత్రి కేటీఆర్. కేంద్ర పౌర విమానయాన శాఖతో.. ప్రాంతీయ వైమానిక అనుసంధానంపై… రాష్ట్ర ప్రభుత్వం MoU కుదుర్చుకుంది. స్కిల్ డెవలప్ మెంట్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం మంచి పరిణామం అన్నారు కేంద్ర మంత్రి. రీజినల్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు కేటీఆర్.

ఆ తర్వాత కేంద్ర పరిశ్రమల మంత్రి అనంత్ గీతేను కలిసిన మంత్రులు… ఆదిలాబాద్ లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్దరణపై చర్చించారు. వీలైనంత త్వరగా ఫ్యాక్టరీని తెరపించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతు సాయం చేస్తుందన్నారు.

మరోవైపు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి అశోక్ లావసాను కలిశారు మంత్రి కేటీఆర్. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు…బడ్జెట్ లో రాష్ట్ర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై చర్చించారు. అటు నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ తో చర్చించారు మంత్రి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నిధులపై కేంద్రానికి సూచించాలని కోరారు.

కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి చాంద్ గెహ్లట్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మంత్రి జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీసీ హాస్టళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

చివరగా కేంద్ర టెక్స్ టైల్స్ మినిస్టర్ స్మృతీ ఇరానీతో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. వరంగల్ టెక్స్ టైల్స్ పార్క్ నిధులు కేటాయింపుపై చర్చించారు, వచ్చే బడ్జెట్ లో సిరిసిల్లా మెగా పవర్ లూమ్ క్లష్టర్ ఏర్పాటు ప్రతిపాదనలు పెట్టాలని కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy