రాష్ట్ర స్థాయి నీట్ లో అర్ణవ్ త్రినాథ్ ఫస్ట్

arnav-trinathరాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులను విడుదల చేసింది కాళోజీ హెల్త్ యూనివర్సిటీ. జాతీయ స్థాయిలో 12వ స్థానంలో నిలిచిన లక్కింశెట్టి అర్ణవ్‌ త్రినాథ్‌కి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కింది. జాతీయ స్థాయిలో 24వ ర్యాంకు పొందిన మంగాని దీపిక, 30వ ర్యాంకు సాధించిన ఎ.వెంకట హేమంత్‌లు వరసగా సెకండ్, థర్డ్ ప్లేస్ లలో ఉన్నారు. జాతీయ స్థాయిలో 86వ ర్యాంకులోపు రాష్ట్ర స్థాయిలో తొలి 10 ర్యాంకులు.. జాతీయ ర్యాంకు 160లోపు రాష్ట్ర స్థాయిలో తొలి 20 ర్యాంకులు ఉన్నాయి. మార్కుల వారీగా పరిశీలిస్తే తొలి 20 రాష్ట్ర ర్యాంకుల్లో తొలి ర్యాంకు అభ్యర్థికి 685 మార్కులు రాగా, 20వ ర్యాంకు అభ్యర్థికి 661 మార్కులొచ్చాయి. ఆదివారం రాత్రి 11 గంటలు దాటాక రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితాను కాళోజీ ఆరోగ్యవర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న తర్వాతే కచ్చితమైన రాష్ట్ర ర్యాంకుల తుది జాబితా వెల్లడవుతుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

రెండో వారంలో సీట్ల భర్తీ ప్రకటన

సీట్ల భర్తీకి ప్రవేశాల ప్రకటన ఈ నెల రెండో వారంలో వెలువడనుందని పేర్కొన్నాయి. సీట్ల భర్తీకి మార్గదర్శకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన అనంతరమే ప్రవేశ ప్రకటన ఉంటుందని సమాచారం. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కళాశాలల్లోని కన్వీనర్‌, యాజమాన్య, NRI కోటాల సీట్లన్నింటినీ కూడా కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలోనే భర్తీ చేయనుండడంతో.. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాల వెల్లడి తప్పనిసరైంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. త్వరలో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తామని, ఈ వారంలో మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెప్పారు. ప్రవేశాలను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy