రాహుల్ గాంధీకి అసొం కోర్టు సమన్లు

rahulఆర్ ఎస్ ఎస్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఓ కేసులో సెప్టెంబర్ 21న వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని గువాహటిలోని ఓ కోర్టు ఆదేశించింది. కిందటేడాది డిసెంబర్లో బార్పేట్ లో ఉన్న 16వ శతాబ్ది నాటి వైష్ణవ దేవాలయాన్ని తాను సందర్శించకుండా ఆరెస్సెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, హిందువునైన తనను ఇది తనను బాధించిందని రాహుల్ ఆ తర్వాత మీడియాతో అన్నారు. ఇది పచ్చి అబద్ధమని, రాహుల్ అసలు ఆ కోవెలకే రాలేదని, పాదయాత్రలో పాల్గొన్నారని, ఇది ఆరెస్సెస్ ను అవమానపర్చడమేనని ఆరోపిస్తూ అంజన్ బోరా అనే ఆరెస్సెస్ కార్యకర్త కోర్టులో పిటిషన్ వేశారు. సెక్షన్ 500 ప్రకారం రాహుల్ శిక్షార్హుడని వాదించారు. దీనిపై ఓ నిందితుడిగా విచారణకు రావాల్సిందిగా జడ్జి సంజయ్ హజారికా రాహుల్ కు సమన్లు పంపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy