రాహుల్ ప్రధాని అయ్యే అవకాశమే లేదు : మమతాబెనర్జీ

MAMAఎక్కువ సీట్లు గెలుపొంది అతిపెద్ద పార్టీగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవతరిస్తే తానే ప్రధాని అన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు TMCఅధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ.  రాహుల్ ఫ్రీగా తన అభిప్రాయాన్ని చెప్పవచ్చన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్ధితుల కారణంగా కాంగ్రెస్ సొంతగా మెజారిటీ వచ్చే అవకాశం లేదన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పాటవుతున్న ఫెడరల్ ఫ్రంట్ దే భవిష్యత్తు అని మమత అన్నారు.ప్రాంతీయ పార్టీలన్నీకలసివచ్చి ఓ ఫ్లాట్ ఫాం ని ఫామ్ చేస్తే అది దేశానికి మంచిదన్నారు. అయితే ప్రాంతీయ పార్టీల కూటమిని మీరు లీడ్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు మాత్రం మమత సరైన సమాధానం చెప్పలేదు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలైన TDP, TRS, DMK లు మంచి ఫలితాలు సాధించే అవకాశముందని ఆమె తెలిపారు. బెంగాళీ న్యూస్ చానెల్ తో మాట్లాడిన మమతా… కర్ణాటకలో బీజేపీకి కానీ, కాంగ్రెస్ కు కానీ, పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదన్నారు. JDS పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందన్నారు.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy