రా.. రమ్మంటోంది : ఉద్యోగాల్లో హైదరాబాద్ బెస్ట్

charminarడిగ్రీలున్నాయి… ఉద్యోగం చేసేందుకు కావల్సినంత సామర్థ్యం ఉంది. అయినా ఉద్యోగం రావట్లేదనే బాధ ఉంది. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా ‘సారీ’ అనే సమాధానమే వినిపిస్తోందా? అయితే మీరున్న ప్రాంతం మారండి.. బిజినె్‌సలో దూసుకుపోతున్న నగరాలకు చేరుకోండి.. అప్పుడు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఉపాధి కోసం రాష్ట్రాలకు రాష్ట్రాలే మారి వెళ్తున్నారు. తాజాగా టీమ్‌లీస్‌ అనే సంస్థ సర్వే చేసింది. ఇలా ఉద్యోగాల కోసం ఊళ్లు తిరిగేవారిని ఎక్కువగా ఆకర్షించే నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచిందని ప్రకటించింది టీమ్‌లీస్‌ సంస్థ. బెంగళూరు, పుణె తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయని స్పష్టం చేసింది ఆ సంస్థ.  కెరీర్‌ గ్రోత్‌ కోసం వస్తున్న వారు మెట్రో సిటీలైన డిల్లీ, ముంబై, చెన్నైలను కాదని ఈ మూడు నగరాలకు క్యూ కడుతున్నారు. టీమ్‌లీస్‌ అనే సంస్థ మన దేశంలోని 13 ప్రధాన నగరాల్లో ఉద్యోగుల పెరుగుదల, వారిని ఆకర్షిస్తున్న అంశాలపై సర్వే చేసింది. బెంగళూరు, పుణె, హైదరాబాద్‌కు తరలివెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య ఏటా పెరుగుతున్నట్లు గుర్తించింది. అసలు ఉద్యోగమే లేనివారు ఏదో ఒకటి వస్తే చాలని ఇలా వెళ్తుంటే, ఇప్పటికే ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నవారు కూడా.. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఊళ్లు మారుతున్నారట. బెంగళూరు, పుణె, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో స్టార్టప్స్‌, బీపీఓ, కేపీఓ లాంటివి పెరగటం వల్లే ఇటు వస్తున్నారని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక  ఉద్యోగాల వృద్ధి ఏ నగరాల్లో నిదానంగా ఉందో కూడా సర్వే వెల్లడించింది. ఈ విభాగంలో మొదటి స్థానంలో లక్నో నిలిచింది. అక్కడ వృద్ధిరేటు మరీ దారుణంగా ఉంది. ఇక ఈ చెత్త నగరాల్లో తర్వాత స్థానాల్లో కోల్‌కతా, బరోడా ఉన్నాయి. వ్యాపారవృద్ధిలో లోటు, పరిశ్రమల స్థాపన లేకపోవడం, నవతరం కంపెనీల కొరత వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది ఆ సంస్థ. 2016 అక్టోబర్‌ నుంచి 2017 మార్చి వరకు గణాంకాలు పరిశీలించి నివేదిక తయారుచేసింది టీమ్‌లీస్‌ సంస్థ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy