రింగ్ వాచ్

635802095685812424ఐపాడ్‌.. ఐప్యాడ్‌.. ఐఫోన్‌.. యాపిల్‌ వాచ్‌.. తన వరుస సంచలనాల జాబితాలో యాపిల్‌ కంపెనీ మరో బుజ్జి గాడ్జెట్‌ను చేర్చింది. అదే.. ఐ రింగ్‌. చూపుడు వేలికి పట్టేంత చిన్న ఉంగరం మాదిరి ఉండే ఈ రింగ్‌కు టచ్‌స్ర్కీన్‌ కూడా ఉంది. దీని ద్వారా ఎంచక్కా ఫొటోలు తీసుకోవచ్చు, మెసేజ్‌లు పంపుకోవచ్చు, టైమ్‌ చూసుకోవచ్చు.. బోలెడన్ని యాప్‌ల్‌ కూడా దీంట్లో లోడ్‌ చేసుకోవచ్చట. యాపిల్‌ వాచ్‌ లాగానే.. దీన్ని ఐఫోన్‌కు  లింకు చేసుకునే  అవకాశమూ ఉంది. ఈ రింగ్‌లో ఉండే మైక్రోఫోన్‌..  మనం డిక్టేట్ చేసిన పదాలను స్పెల్లింగ్‌తో సహా రాసిపెడుతుంది, ఐ ఫోన్‌లో ఇమిడే అన్ని అప్లికేషన్లనూ ఇముడ్చుకుని వాటిని స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తుంది. అంతేకాదు దీన్ని ధరించిన వ్యక్తి ఉన్న చోట వాతావరణ పరిస్థితులను, ఉష్ణోగ్రత వివరాలను చెబుతుంది ఈ రింగ్. పేటెంట్ హక్కులు తీసుకున్నామని… ఈ డివైజ్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తామని ఆపిల్ యాజమాన్యం ప్రకటించింది.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy