రికార్డులతో మురిపించిన సఫారీలు

25sp11eముంబై వన్డేలో రికార్డులు బద్దలయ్యాయి. ఒకే ఇన్నింగ్స్ లో 10కి పైగా కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. హయ్యస్ట్ టీమ్ స్కోర్, ముగ్గురు బ్యాట్స్ మెన్ సెంచరీలు.. వరస్ట్ బౌలింగ్ తో సరికొత్త చరిత్ర నమోదయ్యింది. ఐదు వన్డేల సిరీస్ లో టీమిండియా ఓడిపోయినా….బ్యాట్స్ మెన్ ఇరగదీయడంతో… ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

గాంధీ-మండేలా ఫ్రీడమ్ సిరీస్ లాస్ట్ వన్డేలో రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఇటు బ్యాటింగ్…అటు బౌలింగ్ లో కొత్త రికార్డ్స్ క్రియేటయ్యాయి. హయ్యస్ట్ టీమ్ స్కోర్, ముగ్గురు బ్యాట్స్ మెన్ సెంచరీలు..వరస్ట్ బౌలింగ్ తో సరికొత్త చరిత్ర నమోదయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సఫారీలు…438 రన్స్ చేశారు. టీమిండియాపై ఇప్పటి వరకు అత్యధిక పరుగుల రికార్డును క్రియేట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు వన్డేల్లో 17వ సారి 400 ప్లస్ స్కోర్ నమోదైంది. టీమిండియా కూడా భారీ పరుగులు సమర్పించుకొని చెత్త రికార్డును సొంతం చేసుకుంది.

ఇక భారత్ పై ఏ జట్టుకైనా అత్యధిక స్కోరు 438 పరుగులు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆ రికార్డు సాధించింది. అటు వాంఖడే స్టేడియంలో కూడా ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. ఓవరాల్ గా వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. ఇదిలా ఉంటే వన్డేల్లో ఆరోసారి 400ప్లస్ స్కోర్ చేశారు సఫారీలు. ఈ ఏడాది జనవరిలో వెస్టిండీస్ తో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మూడు సెంచరీలు సాధించింది. ఆ మ్యాచ్ లో సఫారీలు రెండు వికెట్ల నష్టానికి 439 రన్స్ చేశారు.

southముంబయి మ్యాచ్ లో ముగ్గురు సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ సెంచరీలు బాదారు. ఒక వన్డేలో ముగ్గురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేయడం ఇది రెండోసారి. మొదటిసారి కూడా… దక్షిణాఫ్రికానే ఆ రికార్డ్ అందుకుంది. మరోవైపు ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్ లో సఫారీలు 20 సిక్సర్లు బాదారు. మరోవైపు దక్షణాఫ్రికా ఓపెనర్ హషిమ్ ఆమ్లా సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో స్పీడ్ గా 6వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 126 మ్యాచుల్లో 123 ఇన్నింగ్స్ ఆడి ఆరువేల మార్కును సాధించాడు.

ఇక సఫారీ బ్యాట్స్ మెన్ విజృంభనతో…ఇండియన్ బౌలర్లు…భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 10ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ పడగొట్టి 106పరుగులిచ్చాడు. ఇది వన్డే క్రికెట్ హిస్టరీలోనే సెకండ్ వరస్ట్ బౌలింగ్. మ్యాచ్ రికార్డులతో పాటు బ్యాట్స్ మెన్స్ ఇరగదీయడంతో…ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy