రికార్డులను సృష్టిస్తున్న డీజిల్‌, పెట్రోల్‌ ధరలు

india-fuel-stationడీజిల్‌, పెట్రోల్‌ ధరలు రికార్డులను సృష్టిస్తున్నాయి. డీజిల్ ఆల్ టైం ని టచ్ చేయగా లీటర్ పెట్రోల్ ధర మూడేళ్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో పాటు డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీనిస్తుండటం పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. హైదరబాద్ లో లీటర్ పెట్రో ల్ ధర 75 రూపాయల 44 పైసలు, డీజిల్ ధర 67 రూపాయల 20 పైసలు గా ఉంది. రేండేళ్ల క్రితం తగ్గి ఆశలు రేపిన పెట్రోల్ డీజిల్ ధరలు గత ఏడాది కాలంగా మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు కారణంగా దేశంలో పెట్రోల డీజిల్ ధరలు గరిష్ట స్థాయిని తాకాయి. ఇది సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగదారులపై భారంగ పడుతుండగా ..ఆల్ టైం హైని టచ్ చేస్తున్న డీజిల్ ధరల కారణంగా సరుకుల రవాణ భారం పెరిగి వాటి ధరలు భారమవుతున్నాయి.

ఏడాదిన్నర క్రితం 65 రూపాయలుగా ఉన్నలీటర్ ప్రెట్రోల ధర ఇప్పుడు 75 రూపాయల 44 పైసలకు పెరిగింది. డీజిల్ ధర కూడా 50 రూపాయల నుంచి లీటర్ ధర 67 రూపాయల 20 పైసలకు పెరిగింది. మూడు నెలల్లోనే లీటర్ పై ఏడు రూపాయల పెరిగింది. ఇది ఆల్ టైం రికార్డు.. రోజువారీ ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో, ప్రభుత్వం వీటిపై ఎక్సైజ్‌ డ్యూటీలను సైతం తగ్గించింది. కానీ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల ర్యాలీ కొనసాగుతుండటంతో ..దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో నెల రోజుల్లోనే లీటర్ డీజిల్‌ ధరలు మూడు రూపాయలకు పైగా … పెట్రోల్‌ ధరల రెండు రూపాయలకు పైగా పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పరిశీలిస్తే పదేళ్ల క్రితం బ్యారెల్ బ్రెంట్ కూడ్ ధర 100 డాలర్లకు కాస్త అటు ఇటుగా ఉంది.. క్రూడాయిల్ కు డిమాండ్ పెరగడంతో నాలుగేళ్ల క్రితం ఈ ధర 110 డాలర్లను దాటింది. ఆ తరువాత క్రమంగా పతనమవుతూ 36 డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే క్రూడాయిల్ ధర గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 70 డాలర్లు తగ్గింది. దీన్ని లెక్కలోకి తీసుకుంటే ఐదేళ్ల క్రితం ఉన్న పెట్రోల్ ధర కంటె ఇప్పుడు తక్కువగా ఉండాలి కాని అలా జరగడం లేదు ..డీజిల్ ధరల విషయంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించేది.

సబ్సిడీల భారం ఎక్కవుతుందని ఏడేళ్ల క్రితం పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసిన కేంద్రం ఆ తరువాత డీజిల్ పై కూడా నియంత్రణ ఎత్తివేసింది. డీజిల్ ధర కూడా అంతర్జాతీయ క్రూడ్ ధరలను లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుతం 55 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉండాలి.. కాని ప్రస్తుతం డీజిల్ లీటర ధర 67 రూపాయలను దాటింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు పన్నుల రూపంలో వస్తున్న ఆదాయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపడం లేదు. కొద్ద నెలల క్రితం పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగదల మొదలైనప్పు కేంద్ర ప్రబుత్వ సూచనల మేరకు గుజరాత్, మహరాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మద్య ప్రదేశ్ రాష్ట్రాలు స్టానిక పన్నులును పెట్రోల్ పై 3 శాతం ..డిజిల్ పై 5 శాతం తగ్గించాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో పెట్రోల్ పై 31 శాతం..డీజిల్ పై 22.25 శాతం వ్యాట్ ను వసూలు చేస్తున్నారు.. ధరల తగ్గుతున్నపుడు మాత్రం పన్నులు తగ్గించని పెరుగుతన్నప్పుడు ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వంపై వినియోగదారలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy