రికార్డు: ఎవరెస్టు అధిరోహణలో భారతీయ మహిళ

anushప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని నాలుగుసార్లు అధిరోహించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పిన అన్షు జంసెంప మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గత మంగళవారం ఎవరెస్టు ఎక్కిన ఆమె.. ఐదు రోజుల సమయంలోనే మరోసారి ఎవరెస్టు శిఖరాన్ని పాదాక్రాంతం చేసుకున్నారు. దీంతో ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఈ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా అన్షు రికార్డు నెలకొల్పారు. ఆదివారం (మే 21) ఉదయం 8 గంటలకు ఆమె ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరుకున్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్డిలా పట్టణానికి చెందిన అన్షు 2011లో రెండుస్లారు విజయవంతంగా ఎవరెస్టు ఎక్కారు. రెండేళ్ల విరామం తర్వాత ఆమె మూడోసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. 2014లో మరోసారి ఎవరెస్టు ఎక్కేందుకు ఆమె ప్రయత్నించారు. కానీ అదే సమయంలో భూకంపం కారణంగా 18 మంది పర్వతారోహకులు బేస్ క్యాంప్ దగ్గర చనిపోవడంతో ఆమె వెనుదిరిగారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy