రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన చలితీవ్రత

lowesttemperature 22రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోతోంది.  గ్రామాలను మంచు దుప్పటి కప్పేస్తోంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్ పడిపోతుండటంతో .. జనాలు గజగజ లాడుతున్నారు. సూర్యుడు నడినెత్తికొచ్చే వరకు… బయటకు వెళ్లాలంటేనే భయడుతున్నారు. చలి నుంచి రక్షణ కోసం మంటలు వేసుకుంటున్నారు. తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వస్తే  స్వెట్టర్లు, మఫర్లు, మంకీ క్యాపులు వాడుతున్నారు.

రాష్ట్రంలో ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో టెంపరేచర్ ఒక్కసారిగా డౌన్ అయ్యి ..  5డిగ్రీలకు పడిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉట్నూరు, ఇంద్రవెల్లి, జైనూరు మండలాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. మెదక్ లో 9 డిగ్రీలు, రామగుండంలో 10, వరంగల్ లో 17 డిగ్రీలు రికార్డైంది. నైట్ టైంలోనే కాకుండా డే టైంలోనూ టెంపరేచర్ తగ్గింది. చలి తీవ్రతను తట్టుకోలేక కరీంనగర్, వరంగల్ లో ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిలోనూ చలి వణికిస్తోంది. గ్రేటర్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. ఒకేరోజులో 5 డిగ్రీలు తగ్గింది. ఈ సీజన్ లో అత్యల్పంగా 12.5 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఉదయం, సాయంత్రం టైంలో జనాలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఓ వైపు ఎండ ఉన్నప్పటికీ చలి మాత్రం తగ్గడం లేదు. ఏపీలోని విశాఖ మన్యంలోనూ జనం  చలికి వణికిపోతుతున్నారు. ఈ ఏడాది లంబసింగిలో 3 డిగ్రీలు, అరకులోయ, అనంతగిరిలో 5, చింతపల్లిలో 6, పాడేరులో 7డిగ్రీలు నమోదైంది. వచ్చే వారం రోజుల్లో టెంపరేచర్ మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. మంచుతో కప్పిన మాన్యం అందాలను చూసేందుకు టూరిస్టులు పెరిగిపోతున్నారు. అటు ఉత్తర భారతం చలి గుప్పిట్లోనే ఉంది. చలిగాలులతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనగర్ లో మైనస్ 0.9, అమర్ నాథ్ లో మైనస్ 1.9 డిగ్రీలు నమోదయ్యాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రత 7డిగ్రీలకు పడిపోయింది. ఉత్తరప్రదేశ్ లో దట్టంగా పొగమంచు కమ్మేసింది. చలి రికార్డు స్థాయిలో ఉండటంతో.. జనవరి 5 వరకు స్కూళ్లకు హాలీడేస్ అనౌన్స్ చేశారు  లక్నో అధికారులు. మంచు దట్టంగా ఉండటంతో.. పంజాబ్ హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తర, వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులతోనే .. చలి పెరిగిందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందంటున్నారు

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy